టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

50 కోట్లతో సినిమా తీస్తే వచ్చింది 11 కోట్లు….బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమా!!

సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు చాలా వరకు చిన్న లేదా మీడియం రేంజ్ మూవీస్ అని చెప్పాలి. కానీ భారీ బడ్జెట్ సినిమాలు ఏవి కూడా పెద్దగా ధైర్యం చేసి రిలీజ్ చేయలేదు, కానీ ఎప్పటి నుండో పెండింగ్ లో ఉంటూ వస్తున్న భారీ బడ్జెట్ మూవీ తలైవి సినిమాను ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా తీసుకు వచ్చారు. ఈ సినిమా పై పెద్దగా బజ్ లేదు కానీ…

తమిళనాడు ప్రజలు అమ్మా అంటూ పిలుచుకునే ఐరెన్ లేడీ జయలలిత గారి లైఫ్ స్టొరీ అంటూ తెరకెక్కిన ఈ సినిమా ఎప్పటి నుండి వార్తల్లో నిలవగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఆఫర్స్ గట్టిగానే వచ్చినా కానీ మేకర్స్ నో చెప్పి సినిమాను ఆడియన్స్ ముందుకు…

థియేటర్స్ లోనే తేవాలని ఫిక్స్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ చేశారు. సినిమాను మొత్తం మీద 50 కోట్లకు పైగా బడ్జెట్ లో తెరకెక్కించగా బిజినెస్ అనుకున్న రేంజ్ లో ఏమి జరగలేదు, పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ జనాలను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది ఈ సినిమా.

దాంతో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి తమిళనాడులో 7.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ 2.35 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక తెలుగు లో 85 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ కలెక్షన్స్ 11.1 కోట్ల మార్క్ ని మాత్రమే అందుకుని పరుగును ముగించేసింది ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ బాగున్నా కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచిన ఈ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ బడ్జెట్ తో రిలీజ్ అయిన మూవీస్ లో బడ్జెట్ పరంగా భారీ నష్టాలను సొంతం చేసుకుని గట్టి దెబ్బ కొట్టింది తలైవి సినిమా… డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ఆప్షన్స్ ని ఎంచుకుని ఉంటే కచ్చితంగా సినిమాకి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉండేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి కానీ ఇప్పుడు జరగాల్సిన తప్పు జరిగిపోయింది.

Leave a Comment