టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

50 కోట్ల బడ్జెట్…రాబర్ట్ కన్నడ టోటల్ కలెక్షన్స్…బానే వచ్చాయి కానీ!!

కన్నడ టాప్ స్టార్స్ లో ఒకరైన దర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబర్ట్ ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ శివరాత్రి టైం లో రాగా ఫక్తు కమర్షియల్ మూవీ అవ్వడం తెలుగు లో ఇలాంటి కథలు ఎన్నో ఎన్నెన్నో మనం చూసి చూసి ఉండటం తో రివ్యూలు ఏమాత్రం ఆశించిన మేర రాలేదు సినిమా కి, కానీ కన్నడ లో మట్టుకు సినిమా కి రివ్యూ లు ఏవి పట్టించుకోకుండా కలెక్షన్స్ మాత్రం…

అదిరిపోయే రేంజ్ లో రావడం విశేషం అనే చెప్పాలి, ఫస్ట్ వేవ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. కాగా మేకర్స్ సినిమా 100 కోట్లు దాటింది అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేసినా…

కన్నడ ట్రేడ్ వర్గాలు సినిమా కలెక్షన్స్ ని రివీల్ చేశారు. దాదాపు 60 కోట్ల నుండి 65 కోట్ల మధ్యలో సినిమా ఓవరాల్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెబుతున్నారు. ఇక తెలుగు కి వచ్చే సరికి సినిమా 0.25 లక్షల షేర్ ని రన్ కంప్లీట్ అయ్యే టైం కి సొంతం చేసుకుంది.

తెలుగు గ్రాస్ 42 లక్షల దాకా రాగా సినిమా టోటల్ ఇండియా లో 66 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అలాగే ఓవర్సీస్ మొత్తం మీద 2 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 68 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. అందులో మొత్తం మీద షేర్…

కర్ణాటక నుండి 33 కోట్ల దాకా షేర్ ని సాధించిందని, టోటల్ వరల్డ్ వైడ్ గా 35 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకుందని అంటున్నారు. సినిమాను టోటల్ గా 50 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా టోటల్ బిజినెస్ లెక్కలు మాత్రం రివీల్ చేయలేదు… అటూ ఇటూ గా 38 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన సినిమా చాలా వరకు క్లోజ్ గా వచ్చింది అనే చెప్పొచ్చు.

Leave a Comment