టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

50 కోట్ల సినిమా తెలుగు లో టోటల్ గా వచ్చింది ఇది…!!

కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో తమిళనాడు ప్రజలు అమ్మా అంటూ పిలుచుకునే జయలలిత గారి లైఫ్ స్టొరీ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తలైవి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది, పాన్ ఇండియా లెవల్ లో మేజర్ భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా కి మొత్తం మీద 50 కోట్లకు పైగానే బడ్జెట్ ను పెట్టారు. తెలుగు లో ఈ సినిమా ని…

పెద్దగా ఏమి ప్రమోట్ చేయలేదు, అలాగే సినిమాలో జయలలిత గారు టాలీవుడ్ లో అనేక సినిమాలు తీసినా ఏవి కూడా పెద్దగా చూపెట్టలేదు, దాంతో తెలుగు లో పెద్దగా బజ్ ని క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమాను ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు….

దాంతో సినిమా ను ఓన్ గానే రిలీజ్ చేశారు ఇక్కడ… సినిమా కి డీసెంట్ టాకే లభించినా కానీ ఆడియన్స్ థియేటర్స్ అయితే తరలి రాలేదు, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే తీవ్రంగా నిరాశ పరుస్తూ రాగా మొత్తం మీద 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…

80 లక్షల మేర గ్రాస్ ను 45 లక్షల మేర షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి మరో 6 లక్షల షేర్ ని 10 లక్షల గ్రాస్ ను వసూల్ చేయగా టోటల్ గా తెలుగు లో ఈ సినిమా 51 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా టోటల్ గ్రాస్స్ 90 లక్షల రేంజ్ లో ఉందని తెలుస్తుంది.

ఈ కలెక్షన్స్ లో కూడా డెఫిసిట్ లు అలాగే నెగటివ్ షేర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండగా అవి కూడా తీసేస్తే మొత్తం మీద షేర్ 25 నుండి 30 లక్షల లోపే ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా అన్ని వర్షన్ల టోటల్ కలెక్షన్స్ వివరాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. అవి అయ్యాక టోటల్ కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.

Leave a Comment