న్యూస్ బాక్స్ ఆఫీస్

50 కోట్ల సినిమా…2 రోజుల్లో దారుణమైన కలెక్షన్స్!

కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో తమిళనాడు ప్రజలు అమ్మా అంటూ పిలుచుకునే ఐరన్ లేడీ జయలలిత గారి లైఫ్ స్టొరీ గా తెరకెక్కిన సినిమా తలైవి… ఎప్పటి నుండో వార్తల్లో నిలుస్తూ వస్తున్న ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు. సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తీ అయ్యి సెకెండ్ వేవ్ వచ్చే టైం లో సమ్మర్ రిలీజ్ అనుకున్నా సెకెండ్ వేవ్ వలన…

ఈ సినిమా రిలీజ్ ఆగిపోగా సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కోసం అద్బుతమైన ఆఫర్స్ అన్ని వర్షన్స్ కలుపుకుని వచ్చినప్పటికీ కూడా మేకర్స్ ససేమీరా నో చెప్పి సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమాకి ఓవరాల్ గా…

మంచి పాజిటివ్ రివ్యూలు దక్కాయి కానీ కలెక్షన్స్ మాత్రం ఎక్కడా కూడా రాలేదు. సినిమా ఫస్ట్ డే తమిళనాడు లో 1 కోటి గ్రాస్ ను అందుకోగా హిందీ లో 33 లక్షల గ్రాస్ ను అందుకుంది, తెలుగు లో 25 లక్షల గ్రాస్ ను అందుకోగా ఇండియా లో మొదటి రోజు 1.58 కోట్ల గ్రాస్ ను సాధించింది…

ఇక రెండో రోజు మొత్తం మీద తమిళనాడు లో 80 లక్షల గ్రాస్ ను అందుకోగా హిందీ లో 21 లక్షల గ్రాస్ ను అందుకుంది, తెలుగు లో 14 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకోగా రెండో రోజు మొత్తం మీద 1.15 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా 2 రోజుల్లో ఇండియాలో 2.73 కోట్ల గ్రాస్ ని మాత్రమె సొంతం చేసుకుంది…

సినిమాను 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీగా తెరకెక్కించగా రెండు రోజుల్లో టోటల్ ఇండియా వైడ్ గా సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని చూసి ట్రేడ్ వర్గాలు విస్తుపోయారు అని చెప్పాలి. ఈ రేంజ్ డిసాస్టర్ రెస్పాన్స్ పాజిటివ్ టాక్ తో ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి. ఇక ఆదివారం సినిమా ఊహకందని గ్రోత్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment