గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

50 డేస్..6 కోట్లు…..రియల్ యాక్షన్ అంటున్న మంచు మనోజ్!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఫామ్ కోల్పోయి చాలా కాలమే అవుతుంది, కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి పడుతూ లేస్తూ సాగిన కెరీర్ మధ్యలో బిందాస్ నుండి కెరీర్ స్పీడ్ అందుకున్నా పోటుగాడు, కరెంట్ తీగ సినిమా ల తర్వాత కెరీర్ పూర్తిగా స్లో డౌన్ అయింది, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలవడం వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఉండటం తో అవన్నీ కెరీర్ పై ఎఫెక్ట్ చూపాయి.

వ్యక్తిగతంగా అన్నీ సెట్ అయ్యాక రీసెంట్ గా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ ని మొదలు పెట్టాడు మంచు మనోజ్… భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో అహం బ్రహ్మాస్మి అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ ని ఎంచుకున్న మంచు మనోజ్ రీసెంట్ గా తన పుట్టిన రోజున…

సినిమా గురించి చెబుతూ భారీ యాక్షన్ సీన్ ని త్వరలోనే రూపొందించబోతున్నామని, దానికి ఖర్చు అక్షరాల 6 కోట్ల దాకా అవుతుందని, దాదాపు 50 రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతుందని వెల్లడించాడు. కేవలం ఫైట్ సీన్ కోసమే 6 కోట్లు కేటాయించడం ఇప్పుడు టాక్ ఆఫి టౌన్ గా మారింది.

ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే… కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో ఎప్పుడూ ఒరిజినల్ యాక్షన్ సీన్స్ నే చేసే మంచు మనోజ్ ఈ సారి కూడా ఒరిజినల్ రిస్కీ యాక్షన్ సీన్స్ ని ఇందులో పెట్టబోతున్నాడట. పాన్ ఇండియా లెవల్ రూపొందుతున్న ఈ సినిమా పై క్రేజ్ పర్వాలేదు అనిపించేలా ఉంది…

మొత్తం మీద ఈ సినిమా అసలు బడ్జెట్ ఎంత అనేది ఇప్పటికైతే రివీల్ కాలేదు కానీ సుమారు 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమా రూపొందుతుంది అని టాక్ ఉంది, ఈ సినిమా అయినా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు మనోజ్ కి సెన్సేషనల్ కంబ్యాక్ దక్కేలా చేయాలనీ కోరుకుందాం… 

Leave a Comment