న్యూస్ బాక్స్ ఆఫీస్

550 రోజుల్లో ఫస్ట్ టైం 50 కోట్లు….పండగ చేసుకుంటున్నారు!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర ఇండస్ట్రీలు ఎలాగోలా తేరుకుని ఉన్న పరిస్థితులలో కూడా కొన్ని మంచి సినిమాలు పడటం తో కలెక్షన్స్ పరంగా హిట్లు కొట్టి వేవ్ లు వచ్చినా తట్టుకుని నిలబడ్డాయి కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం కంప్లీట్ గా వేరనే చెప్పాలి. అక్కడ ఎంత ట్రై చేసినా లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు సరైన రిలీజ్ ను ఏ సినిమా సొంతం చేసుకోలేదు కలెక్షన్స్ ని కూడా సాధించలేదు…

చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ నే సొంతం చేసుకోగా ధైర్యం చేసి వచ్చిన ఒకటీ అరా సినిమాలు నిరాశనే మిగిలించాయి. ఇలాంటి టైం లో ఆల్ మోస్ట్ ఏడాదిన్నర అంటే 550 రోజుల రేంజ్ టైం తర్వాత బాలీవుడ్ నుండి…

ఆడియన్స్ ముందుకు అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం సినిమా ఇండియా లో 2200 స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని హిట్ టాక్ ని దక్కించుకోగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండి నాసిరకం కలెక్షన్స్ తో సరిపెట్టుకుంటూ వచ్చిన ఈ సినిమా బడ్జెట్ పరంగా బిజినెస్ పరంగా చూసుకుంటే నిరాశనే…

మిగిలిస్తూ వచ్చిందని చెప్పాలి. అయినా కానీ సినిమా లాంగ్ రన్ ని లిమిటెడ్ కలెక్షన్స్ తోనే కొనసాగిస్తూ వస్తుండగా బాక్స్ ఆఫీస్ దగ్గర లేటెస్ట్ గా సినిమా ఇప్పుడు ఒక మైలురాయిని అధిగమించింది…. సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు లేటెస్ట్ గా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో సొంతం చేసుకుంది ఈ సినిమా…

ఇండియాలో 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో 14 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం తో ఆల్ మోస్ట్ 550 రోజులు అంటే ఏడాదిన్నర తర్వాత బాలీవుడ్ నుండి మొదటి 50 కోట్ల గ్రాస్ మూవీ అవ్వడం తో పండగ చేసుకుంటున్నారు.. త్వరలోనే మరిన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ మార్క్ ని అందుకోవాలని కోరుకుంటున్నారు.

Leave a Comment