న్యూస్ బాక్స్ ఆఫీస్

57 కోట్ల బడ్జెట్, 6.7 కోట్ల బిజినెస్…13 రోజుల్లో వచ్చింది ఇది!!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న తమిళ్ హీరోలలో విశాల్ కూడా ఒకరు. కాగా విశాల్ హీరోగా సుందర్ సి డైరెక్షన్ లో అత్యంత భారీ ఎత్తున ఏకంగా 57 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన లేటెస్ట్ మూవీ యాక్షన్. విశాల్ అండ్ తమన్నా ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఆల్ మోస్ట్ 2 వారాలను పూర్తీ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ప్రదర్శన చాలా నాసిరకంగా ఉందని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే యావరేజ్ రేంజ్ లో టాక్ సినిమా కి లభించగా వీకెండ్ వరకు…

పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ వచ్చినా కానీ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులు పూర్తీ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.87 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుని భారీ షాక్ ఇచ్చింది. రీసెంట్ విశాల్ మూవీస్ తెలుగు లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో…

ఈ సినిమా కి తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ 6.7 కోట్ల రేంజ్ లో పలికింది, దాంతో సినిమా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 7.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే హిట్ అవుతుంది. కానీ 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో…

4.33 కోట్ల షేర్ ని అందుకుంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి సినిమా తెలుగు లో డిసాస్టర్ అయ్యిందని చెప్పాలి. ఇక తమిళ్ వర్షన్ అండ్ తెలుగు రెండూ కలిపి కూడా 15 కోట్ల లోపే షేర్ ఉందట. దాంతో బడ్జెట్ పరంగా చూసుకుంటే సినిమా భారీ డిసాస్టర్ అని ట్రేడ్ వర్గాలు తెల్చేశాయి.

Leave a Comment