న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

57 కోట్ల సినిమా…బిజినెస్ తెలిస్తే షాక్!!

తమిళనాడు తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ్ హీరోల్లో విశాల్ కూడా ఒకరు, లాస్ట్ ఇయర్ అభిమన్యుడు మరియు పందెం కోడి 2 సినిమాలతో తెలుగు లో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న విశాల్ ఈ ఇయర్ ఏమాత్రం ప్రమోషన్స్ లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన టెంపర్ రీమేక్ అయోగ్య తెలుగు డబ్ తో కూడా డీసెంట్ కలెక్షన్స్ ని వసూల్ చేశాడు.

ఇక ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుందర్ సి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ అండ్ రా ఏజెంట్స్ నేపధ్యంలో తెరకెక్కిన కథ అవ్వడం తో ఏకంగా బడ్జెట్ అంచనాలను దాటి…

57 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందినట్లు సమాచారం. ఇది విశాల్ కెరీర్ లో రికార్డ్ కాగా సినిమా థియేట్రికల్ బిజినెస్ ఆ బడ్జెట్ రేంజ్ లో జరగలేదు. సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే తమిళనాడు లో సినిమా బిజినెస్ 17 కోట్ల రేంజ్ లో జరగగా… వరల్డ్ వైడ్ గా తమిళ్ వర్షన్ బిజినెస్ ఓవరాల్ గా 21 కోట్లు జరిగిందట.

ఇక తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా సినిమా బిజినెస్ 6.7 కోట్ల రేంజ్ లో జరిగినట్లు సమాచారం, కాగా సినిమా తమిళ్ వర్షన్ హిట్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్ గా 40 కోట్ల లోపు గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుందట. తెలుగు రాష్ట్రాలలో సినిమా హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 7.2 కోట్ల రేంజ్ లో…

షేర్ ని అందుకుంటే ఇక్కడ హిట్ అవుతుంది, సినిమా కి పోటిగా ఈ శుక్రవారం పలు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని కలెక్షన్స్ ని రాబడుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతవరకు జరిగింది అన్నది ఇంకా క్లియర్ గా రివీల్ అవ్వాల్సి ఉంది..

Leave a Comment