గాసిప్స్ న్యూస్

6 గెటప్స్ ఏంటి సామి…ఫ్యాన్స్ కి పండగే ఇది!

5 సినిమాలుగా ఒక్క అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగించి బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైం లో నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న మమ్మోత్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.. అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా కోసం టోటల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా లో రామ్ చరణ్ లుక్…

ఇప్పటికే రిలీజ్ అయ్యి అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఎన్టీఆర్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే టైం లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ లను సొంతం చేసుకుంటున్న…

ఎన్టీఆర్ లుక్ త్వరలోనే రాబోతుందని అంటున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ పలు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. టోటల్ కౌంట్ గా 6 డిఫెరెంట్ గెటప్స్ తో ఎన్టీఆర్ ఇందులో కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ వార్తా తెలిసినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్…

ఆనందానికి అవధులు లేకుండా పోగా… ఫస్ట్ కొమరం భీమ్ లుక్ వచ్చాక మరింత సంతోష పడటం ఖాయం అంటున్నారు. ఆ 6 గెటప్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి రివీల్ కాలేదు కానీ తర్వాత ఒక్కొటిగా రివీల్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇక రామ్ చరణ్ గెటప్స్ కూడా డిఫెరెంట్ గా ఉంటాయని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అనుకున్నా…

కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అయింది. కొత్త డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు వచ్చినా కానీ సెన్సేషనల్ రికార్డులతో ఈ సినిమా ఆల్ ఇండియా లెవల్ లో అన్ని రికార్డులను సవాల్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..

Leave a Comment