టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

6.4 కోట్లు పెడితే…టోటల్ గా వచ్చింది ఇది…పాపం!!

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన సుశాంత్ ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది కానీ నికార్సయిన హిట్ విషయంలో ఎప్పటికీ నిరాశనే ఎదురు అవుతూ వచ్చింది. 2 ఇయర్స్ బాక్ చిలాసౌ తో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు… ఇప్పుడు మళ్ళీ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సుశాంత్ ఈ సారి కూడా నిరాశనే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని హిట్ వేట కొనసాగిస్తున్నాడు.

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించ లేక పోయింది. సినిమా ను మొత్తం మీద 6.4 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా….

నాన్ థియేట్రికల్ బిజినెస్ తో లాభాలు సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, కానీ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 2 కోట్లు అయినా అందుకోవాల్సి ఉండగా సినిమా మొత్తం మీద మొదటి వారంలో 46 లక్షల షేర్ ని సాధించగా రెండో వారంలో…

కేవలం 8 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది. ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
👉Nizam: 12L
👉Ceeded: 7L
👉UA: 7L
👉East: 5L
👉West: 3L
👉Guntur: 6L
👉Krishna: 4L
👉Nellore: 2L
AP-TG Total:- 0.46CR(0.82Cr Gross)
KA+ROI: 2L
OS: 6L~
Total Collections: 0.54CR(1CR~ Gross)
ఇవి సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్…

ఈ కలెక్షన్స్ లో కూడా డెఫిసిట్ లు అలాగే నెగటివ్ షేర్ లు కలిపి ఉన్నాయి…అవి కూడా తీసేస్తే పబ్లిసిటీ ఖర్చులు కూడా అతి కష్టం మీద రికవరీ చేసింది అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఫ్లాఫ్ ని సొంతం చేసుకున్న సుశాంత్ క్లీన్ హిట్ వేటని కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. మరి ఆ హిట్ ఎప్పుడు దక్కుతుందో చూడాలి.

Leave a Comment