గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

60 అన్న బోయపాటి….షాక్ ఇచ్చిన బాలయ్యా!!

నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైం లో చేసిన సినిమాలు అన్నీ పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించాయి, లాస్ట్ ఇయర్ జై సింహా తో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య రెట్టించిన ఊపుతూ భారీ బడ్జెట్ తో తానె స్వయంగా నిర్మాతగా మారి స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ను రెండు భాగాలుగా తెరకేక్కించగా రెండు పార్టులు టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా చేరాయి.

పాజిటివ్ టాక్ వచ్చినా ఆ రెండు అంతటి ఫ్లాఫ్ గా మారడానికి కారణాలు ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టలేదు. ఇక బాలయ్య ఆ ఫ్లాఫులను మరిచి ఇప్పుడు వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న విషయమ్ తెలిసిందే, ముందుగా కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తన కొత్త సినిమా మొదలు పెట్టిన బాలయ్యా…

రీసెంట్ గా బోయపాటి శ్రీను తో మరో కొత్త సినిమా ను కమిట్ అయ్యాడు. రీసెంట్ గా బోయపాటి వినయ విదేయ రామ తో కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా ను తక్కువ బడ్జెట్ లో తీసి మంచి కంబ్యాక్ ఇస్తాడు అని అంతా భావిస్తుండగా….

ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం బాలయ్య నిర్మాత తో సినిమా బడ్జెట్ ఏకంగా 50 నుండి 60 కోట్ల వరకు అవుతుందని చెప్పాడట. దాంతో నిర్మాత బాలయ్య ని కలవగా బాలయ్యా బోయపాటి ని పిలిచి ప్రస్తుతం ఫ్లాఫుల్లో ఉన్నా అంత బడ్జెట్ అయితే నిర్మాత సేఫ్ కాదు అని చెబుతూ….

సినిమా ను 25 కోట్ల నుండి 30 కోట్ల లోపే పూర్తీ చేయాల్సి ఉంటుందని బోయపాటి కి స్ట్రాంగ్ గా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి బోయపాటి తన భారీ హంగులను ఈ సారి వీడి బాలయ్య తో చేసే సినిమా తో ఇద్దరూ కలిసి మంచి కంబ్యాక్ ఇస్తారో లేదో వచ్చే ఇయర్ సమ్మర్ వరకు ఆగితే తెలుస్తుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!