గాసిప్స్ న్యూస్

60 రోజులు మాత్రమే…మెగాస్టార్ ఆర్డర్!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ చేసిన తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్నాడు, ఖైదీ నంబర్ 150 నాన్ బాహుబలి రికార్డులు నమోదు చేయగా తర్వాత వచ్చిన సైరా కూడా సంచలనాలు నమోదు చేసినా సినిమా జానర్ దృశ్యా లాంగ్ రన్ ని సొంతం చేసుకోలేదు, ఇక ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ ని టాలీవుడ్ హిట్ మెషిన్ కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15 న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ లాక్ డౌన్ వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కాగా లాక్ డౌన్ సమయానికి సినిమా షూటింగ్ మొత్తం మీద 40 శాతం మాత్రమె పూర్తీ అయిందట. ఇక మొత్తం మీద మరో…

60% సినిమా షూటింగ్ బాలెన్స్ ఉండగా జూన్ 10 నుండి సినిమా ల షూటింగ్ లు లిమిటెడ్ గా చేసుకోవచ్చు అని చెప్పగా మెగాస్టార్ యూనిట్ కి ఆర్డర్స్ జారీ చేశాడట… జూన్ 10 నుండి 60 వర్కింగ్ డేస్ లో సినిమా షూటింగ్ మొత్తం పూర్తీ అవ్వాలని కండీషన్ పెట్టాడని తెలుస్తుంది.

సినిమా తక్కువ సమయం లోనే తెరకేక్కిస్తారని చెప్పినా వరుసగా పోస్ట్ పోన్ లు, తర్వాత లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన భారీ గా డిలే అవ్వడం తో ఇక డిలే కాకుదని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా త్వరగా పూర్తీ చేసి మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నుండి ఇయర్ కి మినిమమ్…

2 సినిమా లు కంప్లసరీ గా రిలీజ్ చేసేలా చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట చిరంజీవి. ఇక ఆచార్య సినిమా స్పెషల్ క్యామియో ఉండగా అది ఎవరు చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ లేకుండా పోయింది, రామ్ చరణ్ ఈ రోల్ చేయడం ఆల్ మోస్ట్ కన్ఫాం అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Leave a Comment