న్యూస్ బాక్స్ ఆఫీస్

60-41-65….బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తున్న ఉప్పెన!!

మొదటి వారం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో డెబ్యూ హీరోలలో ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసిన ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో నాలుగు కొత్త సినిమాల నుండి తీవ్ర పోటి ని ఎదురుకుంటూ ఉండటం తో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి గా మారగా సినిమా మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

సినిమా 8 వ రోజు 1.13 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 9 వ రోజు ఏకంగా 1.49 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ గ్రోత్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు 9 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో…

60 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఇక సినిమా ఈ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 40 కోట్ల బెంచ్ మార్క్ ని అధిగమించి ఇప్పుడు టోటల్ గా 9 రోజుల్లో 41 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సత్తా చాటుకుంది. ఇక సినిమా టోటల్ గా…

వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క కూడా 65 కోట్ల మార్క్ ని అధిగమించి సూపర్ సాలిడ్ గా దూసుకు పోతూ ఉంది. సినిమా టోటల్ బిజినెస్ 20.5 కోట్ల బిజినెస్ 21 బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాగా సినిమా ఇప్పుడు 9 రోజులు పూర్తీ అయిన తర్వాత ఆల్ మోస్ట్ 20 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ కి ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది, 50 కోట్ల మార్క్ ని అందుకుంటుందా లేదా అన్నది 10 వ రోజు సినిమా సాధించే కలెక్షన్స్ ని బట్టి తర్వాత 11 వ రోజు హోల్డ్ ని బట్టి చెప్పగలం… ఇక 10 రోజులకు గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Leave a Comment