న్యూస్

60,000,000….తెలుగు సినిమా చరిత్రలో ఒకే ఒక్క సినిమా!!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో రికార్డుల విషయంలో దూసుకు పోతుంది, ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఇండియా లో కమర్షియల్ మూవీస్ పరంగా ముందున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల విషయం లోనే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియా రికార్డుల విషయం లో కూడా ముందు ఉంటూ వస్తుంది. టీసర్ ట్రైలర్ రికార్డుల పరంగా కోలివుడ్ ముందు నిలిచేది, లైక్స్ పరంగా ఇప్పటికీ వాళ్ళని అందుకోవడం కష్టమే అవుతుంది…

కానీ ఆ వ్యూస్ పరంగా ఇప్పుడిప్పుడే రికార్డులను సృష్టిస్తున్న టాలీవుడ్ ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ లను టాలీవుడ్ పరంగా నమోదు చేస్తూ రీసెంట్ టైం లో రెట్టించిన జోరు తో దూసుకు పోతూ ఉండటం విశేషం, రీసెంట్ గానే టాలీవుడ్ టీసర్ లు మొదటి సారిగా….

50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని రికార్డ్ సృష్టించడం జరిగింది, కానీ ఇంతలోనే మరో బెంచ్ మార్క్ ని అందుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప టాలీవుడ్ చరిత్ర లో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

ఈ టీసర్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా తర్వాత ఏమాత్రం జోరు తగ్గకుండా జోరు అలానే కొనసాగించి 55 మిలియన్ వ్యూస్ మార్క్ ని కూడా క్రాస్ చేసి ఇప్పుడు ఏకంగా 60 మిలియన్ వ్యూస్ మార్క్ ని కంప్లీట్ చేసి టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 60 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్ గా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

ఈ రేంజ్ భీభత్సం కేవలం ఒక ఇంట్రో టీసర్ కే జరగడం విశేషం, 60 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఇప్పుడు కూడా వ్యూస్ పరంగా జోరు చూపుతున్న ఈ టీసర్ లాంగ్ రన్ లో మరిన్ని బెంచ్ మార్క్ లను సెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. లైక్స్ పరంగా కూడా ఆల్ మోస్ట్ 1.4 మిలియన్ లైక్స్ కి చేరువ అవుతుంది ఈ టీసర్..

Leave a Comment