న్యూస్ బాక్స్ ఆఫీస్

60L అనుకుంటే సుల్తాన్ రెండో రోజు కలెక్షన్స్ ఇవి!!

కోలివుడ్ తో పాటు తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి తమిళ్ లో మొదటి రోజు 5 కోట్లకు పైగా కలెక్షన్స్ ఓపెనింగ్స్ ని లభించగా తెలుగు రాష్ట్రాలలో పెద్దగా ప్రమోషన్స్ చేయక పోయినా కానీ 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ లభించాయి. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా షేర్ ఆల్ మోస్ట్…

1.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం తో సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

రెండో రోజు మొత్తం మీద 72 లక్షల షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది, కానీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మట్టుకు ఈ కలెక్షన్స్ అంతగా సరిపోవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

మొత్తం మీద సుల్తాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 67L
👉Ceeded: 31L
👉UA: 23L
👉East: 17L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 17L
👉Nellore: 8L
AP-TG Total:- 1.89CR (3.55Cr Gross~)
ఇదీ మొత్తం మీద 2 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్క.

సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 6.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 4.61 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. అంటే మూడో రోజు ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Leave a Comment