న్యూస్ బాక్స్ ఆఫీస్

73.5 కోట్లు…7 కోట్ల ప్రాఫిట్…సూపర్ హిట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత దసరా వీకెండ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెంసేషన్ ని క్రియేట్ చేయగా తర్వాత స్లో డౌన్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో పూర్తిగా డల్ అయినా వీకెండ్స్ లో మాత్రం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో రన్ అవుతూ వస్తుంది. మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు సాధించింది.

కొన్ని ఏరియాల్లో మైనర్ నష్టాలు వచ్చినా మొత్తం మీద రెండు రాష్ట్రాల బిజినెస్ 67 కోట్లు అవ్వగా లేటెస్ట్ గా వచ్చినా తుఫాన్ వలన డిస్ట్రిబ్యూటర్లకి బిజినెస్ నుండి తిరిగి 60 లక్షల రేంజ్ లో తిరిగి ఇచ్చేయడం తో బిజినెస్ మొత్తం మీద 66.4 కోట్లు అయింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 రోజుల కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలలో 73.52 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా సినిమా బిజినెస్ కి మొత్తం మీద 7.12 కోట్ల ప్రాఫిట్ ని ఓవరాల్ గా సాధించి రెండు రాష్ట్రాలలో సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా ఫైనల్ రన్ లో ఇక్కడ 74 కోట్ల రేంజ్ లో ముగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!