న్యూస్ బాక్స్ ఆఫీస్

7 ఏళ్లకి హిట్… హిందీ డబ్బింగ్ కి రికార్డ్ రేటు!

మాచో మాన్ గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ ఇయర్స్ లో ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ ని కూడా సొంతం చేసుకోలేక పోయాడు. లౌక్యం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన అన్ని సినిమాలు కూడా ఒకటికి మించి ఒకటి నిరాశ పరిచి గోపీచంద్ కెరీర్ లో డౌన్ ఫాల్ అయ్యేలా చేశాయి కానీ గోపీచంద్ కి ఉన్న మార్కెట్ ఎక్కడికీ పోలేదని, సరైన సినిమా పడితే ఓపెనింగ్స్ అవే….

వస్తాయి అని లేటెస్ట్ గా వచ్చిన సీటిమార్ సినిమా నిరూపించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సి ఉన్నప్పటికీ అందుకు ప్రస్తుత పరిస్థితులు కూడా ఒక కారణం కాబట్టి ఉన్నంతలో సినిమా ఓపెన్ అయిన విధానం అలాగే మొదటి వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్…

ఇవ్వన్నీ చూస్తె కచ్చితంగా గోపీచంద్ దుమ్ము లేపాడు అనే చెప్పాలి, ఆల్ మోస్ట్ 7 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సీటిమార్ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుని ఇప్పుడు కలెక్షన్స్ వేటని కొనసాగిస్తూ ఉండగా ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే హిందీ డబ్బింగ్ రైట్స్ సోల్డ్ అయ్యాయి…

ఈ సినిమాను పెన్ మూవీస్ వాళ్ళు హిందీ లో సొంతం చేసుకోగా గోపీచంద్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అనిపించే రేంజ్ లో 8 కోట్ల రేటు కి సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ సొంతం అయినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కి ముందు రిజల్ట్ ఇంకా తెలియక ముందే సినిమా హిందీ డబ్బింగ్ రేటు 8 కోట్ల రేటు కి అమ్ముడు పోవడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి.

ఈ రేంజ్ లో రేటు సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన తగ్గినా కానీ ఈ బిజినెస్ తో కొంత బడ్జెట్ రికవరీ అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ వివరాలు కంప్లీట్ గా రివీల్ అవ్వాల్సి ఉంది, ఆ వివరాలు వచ్చిన తర్వాత సినిమా ద్వారా నిర్మాతలకు లాభామా నష్టమా అనేది చెప్పగలం…

Leave a Comment