గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

7 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా…OTT ఆఫర్ తెలిస్తే షాక్!

చాలా సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా కానీ ఆడియన్స్ ముందుకు రాలేక పోతాయి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలన కావచ్చు, మరేవైనా గొడవల వల్ల కావొచ్చు , రీజన్ ఏదైనా కొన్ని సినిమాలు షూటింగ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాకుండా అలాగే ఆగిపోతాయి. తర్వాత ఎవరైనా రైట్స్ కొనడం లాంటివి చేస్తే అప్పుడు సినిమా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలానే ఈ మధ్య చాలా పాత సినిమాలు ఒక్కొటిగా బయటికి వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది 7 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఓ చిన్న సినిమా. యంగ్ హీరో సందీప్ కిషన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ నే సొంతం చేసుకున్నాయి.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మాదిరి రా రస్టిక్ కథగా అనిపించిన ఈ సినిమా సందీప్ కి మంచి మాస్ ఇమేజ్ తెస్తుంది అనుకుంటే సినిమా రిలీజ్ 7 ఏళ్ళు అయినా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాకుండా అలానే ఉంది. ఇక 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపధ్యంలో…

కొన్ని స్ట్రీమింగ్ యాప్స్ కొత్త పాత సినిమాలను కొని డిజిటల్ రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా కి కూడా డీసెంట్ ఆఫర్స్ వస్తుండగా అందులో 4 కోట్ల రేంజ్ ఆఫర్ కూడా దక్కిందని ట్రేడ్ లో టాక్ ఉంది. ఆ టైం లో సినిమా రిలీజ్ అయినా కానీ ఇంత బిజినెస్ చేసి ఉండేదో లేదో చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం…

పడుతూ లేస్తూ ఉన్న సందీప్ మార్కెట్ దృశ్యా ఇది మంచి డీల్ అనే చెప్పాలి. అది కూడా 7 ఏళ్ల క్రితం సినిమా కాబట్టి నిర్మాత ఓకే అంటే సినిమా త్వరలో డిజిటల్ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ న్యూస్ పై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

Leave a Comment