న్యూస్

7 ఏళ్ల క్రితం మూవీ…20 లక్షల రేటు…TRP రేటింగ్ ఎంతంటే!

ఒక ఛానెల్ ఫాలో అయ్యే రూట్ ని మరో ఛానెల్ కూడా ఫాలో అవ్వడం అన్నది కామన్, డైరెక్ట్ సీరియల్స్ ప్లేస్ లో డబ్బింగ్ సీరియల్స్ వేయడం కానీ కొత్త సినిమాలు వేసే టైం లూ అదే టైం కి ఇతర ఛానెల్స్ తమ కొత్త సినిమాలను వేయడం పోటి లో భాగమే. ఇక రీసెంట్ గా స్టార్ మా ఫాలో అయిన రూల్ ని ఇప్పుడు ఇతర ఛానెల్స్ కూడా…

బాగానే ఫాలో అవుతున్నాయి…. కొత్త సినిమాలు లేని కారణంగా మళ్ళీ మళ్ళీ పాత సినిమాలను వేయలేక ఇది వరకు రిలీజ్ అయిన డైరెక్ట్ లేదా డబ్బింగ్ మూవీస్ ని పట్టుకొచ్చి ఎంతో కొంత శాటిలైట్ రైట్స్ రేటు చెల్లించి ఆ సినిమాలను మినిమమ్ ప్రమోషన్ తో…

టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తున్నాయి.. ఈ పద్దతి స్టార్ మా కి బాగా కలిసి రాగా ఇప్పుడు ఆ రూట్ ని ఒకపక్క జెమినీ టీవీ మరో పక్క జీ తెలుగు కూడా ఫాలో అవుతుండగా ఇందులో భాగంగా రీసెంట్ గా జీ తెలుగు తమిళ్ డబ్ మూవీ నా లవ్ స్టొరీ మొదలైంది ని టెలికాస్ట్ చేసింది.

శివ కార్తికేయన్ ప్రియా ఆనంద్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎప్పుడో 7 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా కాగా తెలుగు లో 6 ఏళ్ల క్రితం థియేటర్స్ లో రిలీజ్ చేశారు కానీ ఎవ్వరూ పట్టించు కోలేదు… ఆ సినిమాను ఏరికోరి ఇప్పుడు ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత రీసెంట్ గా జీ తెలుగు లో టెలికాస్ట్ చేశారు…

సినిమా ను మొత్తం మీద కేవలం 20 లక్షల ఫ్యాన్సీ రేటుకి కొన్న జీ తెలుగు వాళ్ళు మినిమమ్ ప్రమోషన్స్ చేసి సినిమాను రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా సినిమా కి ఫస్ట్ టెలికాస్ట్ లో 2.88 రేటింగ్ దక్కింది. అంత ఓల్డ్ మూవీ కి అందునా పెట్టిన రేటు ప్రకారం చూసుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పాలి.

Leave a Comment