గాసిప్స్ న్యూస్

7 ఏళ్ళుగా హిట్ లేదు….అయినా క్రేజ్ తగ్గలేదు…ఈ రికార్డ్ బిజినెస్సే నిదర్శనం!

మాస్ హీరో గోపీచంద్ హిట్ కొట్టి ఏళ్ళు అవుతున్నా మాస్ లో ఇప్పటికీ తనకి క్రేజ్ ఎంతో కొంత ఉందని చెప్పాలి. కెరీర్ లో హిట్స్ ఫ్లాఫ్స్ కామన్ కానీ గోపీచంద్ కి ఈ సారి గ్యాప్ మరింత ఎక్కువ అయింది, ఇది వరకు కూడా వరుస ఫ్లాఫ్స్ వెక్కిరించినా కానీ సాహసం, లౌక్యం లాంటి సినిమాలతో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మరో హిట్ ని అందుకోలేక పోతున్నాడు. మధ్య లో ఒకటి రెండు…

 

మంచి సినిమాలు పడినప్పటికీ కూడా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఇలాంటి టైం లో రచ్చ ఫేం సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ గౌతమ్ నంద సినిమా తర్వాత చేస్తున్న సినిమా సీటిమార్.. తమన్నా హీరోయిన్ గా…

 

చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండో జరుగుతూ వస్తుండగా సినిమా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్లు వచ్చినా నో చెప్పిన మేకర్స్ సినిమాను బాక్స్ ఆఫీస్ సమ్మర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన వెనక్కి తగ్గగా డిజిటల్ రిలీజ్ కోసం మళ్ళీ ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు యూనిట్..

 

కానీ ఇప్పుడు సినిమా అన్ని హక్కులను గంపతుత్తుగా జీ నెట్ వర్క్ భారీ రేటు చెల్లించి సొంతం చేసుకుందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.. సినిమా బడ్జెట్ బిజినెస్ లాంటివి పట్టించుకోకుండా టోటల్ అన్ని రైట్స్ ని గంపగుత్తుగా ఏకంగా 26 కోట్ల రేంజ్ రేటు కి సింగిల్ పెయిమేంట్ తో సొంతం చేసుకోబోతుంది అని అంటున్నారు. అంటే ఇక సినిమా నిర్మాతలకు వేరే బిజినెస్ లు ఏవి చేసుకోలేరు..

 

సినిమా శాటిలైట్, డిజిటల్ థియేట్రికల్ బిజినెస్ ఇలా అన్ని హక్కులను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుని తమ పద్దతిలో సినిమా బిజినెస్ ను చేసుకుంటుంది అన్న మాట. 7 ఏళ్ళుగా హిట్ లేకున్నా ఈ రేంజ్ రేటు సొంతం అవ్వడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి. మరి సినిమా త్వరలోనే థియేట్రికల్ బిజినెస్ ఎంతవరకు సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

 

Leave a Comment