గాసిప్స్ న్యూస్

7 కోట్ల డెఫిసిట్ లో నిశ్శబ్దం….అలా జరిగితేనే లెక్క పెరిగేది!

కొన్ని సినిమాల ఫలితాలు వేరే సినిమా ల పై ఇంపాక్ట్ గట్టిగా చూపుతాయి అంటారు, రీసెంట్ గా టాలీవుడ్ తరుపున డైరెక్ట్ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకున్న సినిమా వి ది మూవీ ఫలితం తేడాగా రాగా ఆ ఇంపాక్ట్ ఇతర సినిమా ల పై గట్టిగానే పడింది. ఆ సినిమా టెలికాస్ట్ తర్వాత ఇతర సినిమాలకు రేట్ల ని అమాంతం తగ్గించేశాయి OTT యాప్స్.

ఇందులో కొన్ని క్రేజీ సినిమాలకు కూడా రేటు తగ్గగా మరి కొన్ని సినిమా లు చాలా డిలే చేసి రేట్లని తగ్గించుకున్నాయి. ఈ కోవలోకే వచ్చే సినిమా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా అని చెప్పాలి. సమ్మర్ రేసులో నిలిచిన కి అప్పుడే స్టార్టింగ్ రేటు 26 కోట్లు ఆఫర్ చేశారు.

నిర్మాతలు గట్టిగా ట్రై చేసి ఉంటె ఈ రేటు 30 కోట్ల రేంజ్ కి కూడా వెళ్లి ఉండేది కానీ నో చెప్పి చాలా డిలే తర్వాత వచ్చిన రేటు కే ఓకే చెప్పారు. ఆ రేటు 23 కోట్లు కాగా సినిమా కి పెట్టిన బడ్జెట్ 30 కోట్లు అవ్వడం తో మంచి క్వాలిటీ తో…

సినిమా చేశామని అయినా 7 కోట్ల డెఫిసిట్ తో రిలీజ్ ఏంటని OTT వాళ్ళని అడిగినప్పటికీ ఇప్పుడు ఈ రేటు కే సినిమా ను కొంటామని వారు గట్టిగానే చెప్పారట. మరో ఆప్షన్ లేదా అంటే… సినిమా కి టాక్ బాగుండి, ఓవరాల్ గా మంత్ ఎండ్ వరకు వ్యూస్ అనుకున్న వాటి కన్నా ఎక్కువగా వస్తే…

వ్యూస్ ని బట్టి మంత్లీ పెయిమేంట్ ఇస్తామని చెప్పారట. దాంతో ఇప్పుడు సినిమా టాక్ మీద డెఫిసిట్ ఫ్యూచర్ లో క్లియర్ అవుతుందా లేదా అన్నది తేలనుంది అని చెప్పాలి. సినిమా కి టాక్ బాగుండి వ్యూస్ బాగా వస్తే నెలల వారిగా నిర్మాతలకు అమౌంట్ ఎక్స్ ట్రాగా చేరుతుంది. మరి సినిమా కి టాక్ ఎలా వస్తుందో చూడాలి మరి…

Leave a Comment