న్యూస్ బాక్స్ ఆఫీస్

7 వ రోజు 6 కోట్లు అనుకుంటే ఏకంగా 7 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా హాలిడే ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 7 వ రోజు దసరా హాలిడే అవ్వడం తో అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించింది, సినిమా 6 వ రోజు తో పోల్చుకుంటే 7 వ రోజు ఆల్ మోస్ట్ 15 టు 20% గ్రోత్ ని ఈవినింగ్ అండ్ నైట్ షోలలో…

సాధించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంతకిమించి ఉండటం తో ఓవరాల్ గా 7 వ రోజు కలెక్షన్స్ పరంగా టోటల్ గా అంచనాలను మించి 7 వ రోజు టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది సైరా నరసింహా రెడ్డి.

కాగా 7 వ రోజు 6 కోట్ల రేంజ్ షేర్ పక్కా అనుకోగా ఫైనల్ కౌంట్ 6.5 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా ఏకంగా 7.9 కోట్ల షేర్ ని సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది, 7 వ రోజు బాహుబలి 2 8.3 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది.

కేవలం 40 లక్షలతో బాహుబలి 2 ఇండస్ట్రీ రికార్డ్ ను మిస్ అయిన సైరా నరసింహా రెడ్డి మొత్తం మీద 7 వ రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో గమనిస్తే
Nizam: 2.28Cr
?Ceeded: 1.71Cr
?UA: 1.55Cr
?East: 52L
?West: 29L
?Guntur: 64.5L
?Krishna:63.2L
?Nellore: 27.1L
AP-TG Day 7:- 7.90Cr ఇదీ సినిమా సాధించిన కలెక్షన్స్ ఊచకోత.

ఇక వరల్డ్ వైడ్ గా కూడా 7 వ రోజు సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టిన సైరా ఓవరాల్ గా మొదటి వారానికి గాను టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులతో హోరేత్తించింది అని చెప్పాలి. ఇక 7 రోజులకు గాను అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు కొద్ది సేపట్లో అప్ డేట్ చేస్తాం…

Leave a Comment