న్యూస్ బాక్స్ ఆఫీస్

7.4 కోట్ల మాస్…..2 సినిమాలను మించిన ఎనిమీ తెలుగు ఫస్ట్ డే కలెక్షన్స్!

దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో తెలుగు లో అసలు పెద్దగా బజ్ ఏమి లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఎనిమీ… రజినీ పెద్దన్న మారుతి మంచి రోజులు వచ్చాయి కి సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీనే జరిగింది కానీ ఎనిమీ చాలా సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది, ఓపెనింగ్స్ కూడా ఆ రెండు సినిమాలతో పోల్చితే వీక్ గానే స్టార్ట్ అయిన ఈ సినిమా…

రోజును ఎండ్ చేసిన తీరు మాత్రం ఆ 2 సినిమాలను మించి పోయి గ్రోత్ ని చూపెట్టి అనుకున్న కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 60-70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని అనుకోగా…

సినిమా ఆ అంచనాలను మించిపోయి రోజు ముగిసే సరికి 80-90 దాటేది 96 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం, గుంటూరులో 6 లక్షల హైర్స్ యాడ్ అవ్వగా టోటల్ గా ఫస్ట్ డే 1.02 కోట్ల షేర్ ని సాధించింది ఈ సినిమా.. ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది..

👉Nizam: 38L
👉Ceeded: 16L
👉UA: 12L
👉East: 9L
👉West: 6L
👉Guntur: 12L
👉Krishna: 5.4L
👉Nellore: 5L
AP-TG Total:- 1.02CR(1.6CR~ Gross)
మిగిలిన రెండు సినిమాలు డౌన్ అయిపోతే డౌన్ అవుతుంది అనుకున్న ఎనిమీ ఫస్ట్ డే దుమ్ము లేపింది అనే చెప్పాలి. సినిమా తెలుగు బిజినెస్ 4.5 కోట్లు కాగా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడానికి…

సినిమా ఇంకా 3.98 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక తమిళనాడులో 2.55 కోట్ల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.15 కోట్ల గ్రాస్ ను, ఓవర్సీస్ లో 2.1 కోట్ల గ్రాస్ ను అందుకుని మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 7.4 కోట్ల గ్రాస్ ను 3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఫస్ట్ డే కుమ్మేసింది.

Leave a Comment