టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

7.5 కోట్ల బడ్జెట్…3 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం మరీ అంచనాలాను అందుకోలేక పోయింది. పోటి లో సీటిమార్ ఉండటం తో ఓపెనింగ్స్ కి దెబ్బ పడగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా సినిమా ఎక్కడా జోరు చూపలేదు.

మొత్తం మీద సినిమాను 7.5 కోట్ల బడ్జెట్ లో రూపొందించారు, నాన్ థియేట్రికల్ బిజినెస్ వలన సినిమా కి ప్రాఫిట్ వచ్చింది, దాంతో బాక్స్ ఆఫీస్ బిజినెస్ అండ్ కలెక్షన్స్ పెద్ద ఇంపార్టంట్ కాదు కానీ సినిమా ఓవరాల్ గా 2.75 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 3 కోట్ల టార్గెట్ తో బరిలోకి…

దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి 1.84 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా తర్వాత మిగిలిన రన్ మొత్తం మీద మరో 14 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది…

👉Nizam: 53L
👉Ceeded: 34L
👉UA: 26L
👉East: 20L
👉West: 13L
👉Guntur: 21L
👉Krishna: 15L
👉Nellore: 10L
Total AP TG: 1.92CR(3.40CR~ Gross)
👉KA+ROI: 5L
👉OS: 1L~
TOTAL Collections: 1.98CR(3.52CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క..

3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా మొత్తం మీద 1.02 కోట్ల దూరంలోనే పరుగును ఆపేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచింది, ఈ ఇయర్ ఏ1 ఎక్స్ ప్రెస్ తో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ అందుకోలేక పోయిన సందీప్ కిషన్ ఈ సినిమా తో హిట్ అందుకుంటాడు అనుకున్నా నిర్మాతలకు లాభాలు తెప్పించాడు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేక పోయాడు.

Leave a Comment