న్యూస్ బాక్స్ ఆఫీస్

7.5 కోట్ల బడ్జెట్…..4 రోజుల్లో కలెక్షన్స్ ఇవి!

సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ కలెక్షన్స్ తో ఓపెన్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగగ్ర వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి కూడా యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి వర్కింగ్ డేస్ లో కొంచం కష్టపడితే క్లీన్ హిట్ ని అందుకునే…

అవకాశం ఎంతైనా ఉండగా 4 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న ఈ సినిమా 3 వ రోజు తో పోల్చితే పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసింది అని చెప్పాలి. నార్మల్ గా హాలిడే తర్వాత డ్రాప్స్ 50% కి పైగా నే ఉంటాయి చాలా సినిమాలకు…

ఈ సినిమా 3 వ రోజు 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే 4 వ రోజు 20 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 21 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక సినిమా మొత్తం మీద 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి….

వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 44L
👉Ceeded: 27L
👉UA: 20L
👉East: 14L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 11L
👉Nellore: 8L
Total AP TG: 1.50CR(2.56CR~ Gross)
👉KA+ROI: 4L
👉OS: 1L~
TOTAL Collections: 1.55CR(2.60CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…

సినిమాను మొత్తం మీద 7.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా సినిమాను 2.75 కోట్లకు అమ్మారు, 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.45 కోట్ల షేర్ ని ఇంకా అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. వర్కింగ్ డేస్ లో మరింత హోల్డ్ చూపితే బిజినెస్ ని అందుకునే అవకాశం ఉంది ఈ సినిమా కి..

Leave a Comment