గాసిప్స్ న్యూస్

70 కోట్ల కథ…నాగచైతన్య దగ్గరకి…ఏమంటాడో మరి!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లాస్ట్ ఇయర్ మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ తో రెట్టించిన జోరు లో ఉండగా తన కొత్త సినిమా లవ్ స్టొరీ కూడా భారీ అంచనాలతో రూపొందగా సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా తర్వాత నాగ చైతన్య కొత్త సినిమా ను టాలెంటెడ్ డైరెక్టర్ విక్రం కుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. డిఫెరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుని వాటికి…

తనదైన స్టైల్ లో ట్రీట్ మెంట్ ని అందించి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్లు కొట్టిన విక్రం కుమార్ ఈ మధ్య కొద్దిగా స్లో అయినా ఈ సినిమా తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుండగా నాగ చైతన్య ఈ సినిమా తర్వాత సినిమాలను కూడా కమిట్ అయ్యే పనిలో ఉండగా…

రీసెంట్ గా ఓ భారీ బడ్జెట్ కథని విన్నాడని టాక్…. టాలీవుడ్ లో ఒక జానర్ కే పరిమితం అవ్వకుండా డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో తనకంటూ ఒక గుర్తుంపు సొంతం చేసుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి రీసెంట్ గా వి ది మూవీ చేయగా ఆ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.

అయినా కానీ ఉన్నంతలో నాని ని డిఫెరెంట్ గా చూపెట్టడం సుధీర్ బాబు లో మాస్ హీరో ఉన్నాడని ఎలివేట్ చేయడం అందరికీ బాగా నచ్చగా తన తర్వాత సినిమా ను నాగ చైతన్య చేయాలి అనుకున్న మోహనకృష్ణ ఓ భారీ సబ్జెక్ట్ ని నాగ చైతన్య కి వినిపించారని అంటున్నారు. పూర్తిగా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో….

తెరకెక్కే ఈ సినిమా కి 70 కోట్ల రేంజ్ బడ్జెట్ అవసరం అని రీసెంట్ గా ఇదే కథని దిల్ రాజు కి వినిపించగా వి మూవీ ఎఫెక్ట్ వలన ఈ సబ్జెక్ట్ ని వద్దూ అన్నప్పటికీ నాగ చైతన్య ఓకే అంటే వేరే నిర్మాత తో చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది, కానీ నాగ చైతన్య తన నిర్ణయాన్ని ఇంకా చెప్పాలి ఉందని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి…

Leave a Comment