గాసిప్స్ న్యూస్

70 కోట్ల సినిమా….సినిమా నుండి నిర్మాత పేరు ఔట్!!

సినిమా ను నిర్మించిన నిర్మాత పేరు సినిమా టైటిల్స్ లో నుండి తొలగించడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది, లేటెస్ట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో అనేక కోణాలు ఉన్న నేపధ్యంలో… సోషల్ మీడియా లో సుశాంత్ ఫ్యాన్స్ ప్రతీ రోజూ తనకి న్యాయం జరగాలి అంటూ కోరుకుంటునే తనకి అవకాశాలు లేకుండా చేసిన బాలీవుడ్ వాళ్ళపై మండి పడుతూ రోజు ఎదో ఒక ట్రెండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా స్టార్ బ్యాగ్ డ్రాప్ తో సినిమా ఛాన్సులు దక్కించుకునే స్టార్ కిడ్స్ పై నెపోటిజం పేరుతో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దాంతో కొందరు స్టార్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ని డిసేబుల్ చేసుకోగా… కొందరు ఎదురు కామెంట్స్ చేస్తూ మరింత ట్రోల్ అవుతున్నారు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ నటించిన బయోపిక్ గుంజన్ సక్సేనా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందరూ నెపో కిడ్ అంటూ జాన్వి కపూర్ ని తీవ్రంగా ట్రోల్ చేయగా సుశాంత్ కి సినిమా ఛాన్సులు లేకుండా చేసిన వారిలో ఒకరిగా చెప్పుకుంటున్న కరణ్ జోహార్…

ఈ సినిమా కి నిర్మాత అవ్వడం భారీ ట్రోల్స్ ని ఈ సినిమా ఎదురుకుంటుంది. దాంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని సుమారు 70 కోట్లు పెట్టి కొన్న నెట్ ఫ్లిక్స్ ఈ హీట్ ని తట్టుకోలేక ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందట. త్వరలో డిజిటల్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టైటిల్స్ లో నిర్మాత పేరు ని తొలగించబోతున్నట్లు సమాచారం.

జాన్వి కపూర్ కి సుశాంత్ కేసుతో ఎలాంటి సంభందం లేకున్నా కానీ నెపో కిడ్ అండ్ కరణ్ జోహార్ సినిమా అవ్వడం తో తను కూడా భారీగా ట్రోల్ అయ్యింది. ఇక సినిమా కోసం 30 కోట్లు ఖర్చు చేసిన నిర్మాత కరణ్ జోహార్… 40 కోట్ల ప్రాఫిట్ రావడంతో సినిమా నుండి తన పేరు తీసేయడంపై సుముఖంగానే ఉన్నారని సమాచారం. దాంతో ఫ్యాన్స్ కొద్దిగా ఈ సినిమా పై శాంతించారట…

Leave a Comment