న్యూస్

70K కొడితే చాలు…చరిత్రలో టాప్ 2 ఖాయం…మెంటల్ మాస్ ఇది!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని రామ్ చరణ్ ఇంట్రో టీసర్ అల్టిమేట్ రికార్డుల తర్వాత ఇప్పుడు 7 నెలల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ఊహకందని రికార్డులతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తరుపున మొదటి 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని బిగ్గెస్ట్ మార్జిన్ తో బ్రేక్ చేయగా….

లైఫ్ టైం లో కూడా సెన్సేషనల్ లైక్స్ తో దూసుకు పోతున్న ఈ టీసర్ మొత్తం మీద అన్ని వర్షన్స్ కలుపుకుని 2 మిలియన్స్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించగా ఒక్క వర్షన్ పరంగా చూసుకుంటే తెలుగు లో ప్రస్తుతానికి 1.13 మిలియన్ లైక్స్ ని….

దాటుకుని దూసుకు పోతుండగా సినిమా ఇంట్రో టీసర్ ముందు మరో అద్బుతమైన రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది, ఇండియా లో టీసర్ల పరంగా హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో విజయ్ సర్కార్ టీసర్ 1.4 మిలియన్ లైక్స్ ని అందుకోగా రెండో ప్లేస్ లో…

విజయ్ నటించిన మరో సినిమా మెర్సల్ 1.2 మిలియన్ లైక్స్ ని అందుకుని రికార్డ్ సృష్టించింది. మొత్తం మీద మరో 70 వేల లైక్స్ ని సొంతం చేసుకున్న రామరాజు ఫర్ భీమ్ ఇంట్రో టీసర్ మెర్సల్ ని దాటుకుని ఇండియా లో టాప్ 2 ప్లేస్ కి చేరుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ ఇంట్రో టీసర్ లాంగ్ రన్ లో కూడా రోజూ మంచి వ్యూస్ అండ్ లైక్స్ తో…

దూసుకు పోతూ ఉండటం తో ఫైనల్ గా కొత్త బెంచ్ మార్క్ ని అందుకునే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇక టాప్ ప్లేస్ ని అందుకోవాలి అంటే మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉంది కానీ ఇంట్రో టీసర్ కే ఇలాంటి రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా మెయిన్ టీసర్ ట్రైలర్లకు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Leave a Comment