న్యూస్ బాక్స్ ఆఫీస్

75 కోట్లతో సినిమా తీస్తే… 11 కోట్లు…ఫస్ట్ సినిమాతోనే ఇండియన్ బిగ్గెస్ట్ డిసాస్టర్ కొట్టిన హీరో!

ప్రతీ ఇయర్ ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీ లలో అడుగు పెడుతూ ఉంటారు… ఏ హీరో కెరీర్ లో అయినా ఫస్ట్ సినిమా అన్నది చాలా స్పెషల్, కొత్తగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టేవాళ్ళకి ఫస్ట్ సినిమా హిట్ అయితేనే తర్వాత ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి, ఇక స్టార్ కిడ్స్ కి అయితే ఫస్ట్ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అని భారీ హంగులతో స్టార్ కాస్ట్ తో సినిమాలు ప్లాన్ చేస్తూ ఉంటారు, ఇండియా లో ఫస్ట్ సినిమా నే హైయెస్ట్….

బడ్జెట్ తో చేసిన హీరోలు కొందరు ఉండగా ఆ సినిమాల బడ్జెట్ లు 50 కోట్ల రేంజ్ కి వెళ్ళగా ఒకటి రెండు సినిమాలు 65 కోట్లు, 70 కోట్ల దాకా కూడా వెళ్ళగా మొదటి సినిమా కి ఇండియా లో హైయెస్ట్ బడ్జెట్ అయింది మాత్రం కన్నడ యాక్టర్ నిఖిల్ గౌడ…

నటించిన మొదటి సినిమా జాగ్వార్ కే అని చెప్పాలి. ఈ సినిమా ను ఏకంగా 75 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించగా భారీ హైప్ తో రావడం తో ఈ సినిమా కి కన్నడలో ఆల్ మోస్ట్ 8 కోట్ల మేర షేర్ దక్కగా డబ్బింగ్ వర్షన్స్ కలెక్షన్స్ మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో వచ్చాయి.

దాంతో సినిమా మొత్తం మీద సాధించిన షేర్ అటూ ఇటూ గా 11 కోట్ల మార్క్ నే అందుకోగా టోటల్ లాస్ ఏకంగా 64 కోట్ల రేంజ్ లో వచ్చి ఇండియా లోనే మొదటి సినిమా పరంగా బిగ్గెస్ట్ లాస్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలవగా మొదటి సినిమా తో హైయెస్ట్ నష్టాలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది.

సినిమా పబ్లిసిటీ ఖర్చుల కోసం ఏకంగా 5 కోట్ల మేర ఖర్చు చేశారు, అది కూడా కలుపుకుంటే ఏకంగా లాస్ 69 కోట్ల మేర వచ్చి ఉండొచ్చని అంచనా. ఇది వరకు అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ నటించిన మీర్జా సినిమా కి కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లాస్ ని అందుకుంది… ఫస్ట్ సినిమా డిసాస్టర్ అయినా నిఖిల్ అప్ కమింగ్ మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతుండగా తన లేటెస్ట్ మూవీ రైడర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a Comment