గాసిప్స్ న్యూస్

8 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా…2021 లో OTT ఆఫర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

టాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీ అయినా కానీ అనేక సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా కానీ ఆడియన్స్ ముందుకు రాలేక పోతాయి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలన కావచ్చు, మరేవైనా గొడవల వల్ల కావొచ్చు , రీజన్ ఏదైనా కొన్ని సినిమాలు షూటింగ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాకుండా అలాగే ఆగిపోతాయి. తర్వాత ఎవరైనా రైట్స్ కొనడం లాంటివి చేస్తే అప్పుడు సినిమా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలానే ఈ మధ్య చాలా పాత సినిమాలు ఒక్కొటిగా బయటికి వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది 8 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఓ చిన్న సినిమా. యంగ్ హీరో సందీప్ కిషన్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా టీసర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ నే సొంతం చేసుకున్నాయి.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మాదిరి రా రస్టిక్ కథగా అనిపించిన ఈ సినిమా సందీప్ కి మంచి మాస్ ఇమేజ్ తెస్తుంది అనుకుంటే సినిమా రిలీజ్ 8 ఏళ్ళు అయినా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాకుండా అలానే ఉంది. లాస్ట్ ఇయరే ఫస్ట్ వేవ్ లో డిజిటల్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు సెకెండ్ వేవ్ లో….

కొంచం క్రేజ్ ఉన్నా అలాగే క్వాలిటీ ఉన్న సినిమాల అన్వేషణ చేస్తుండగా ఈ సినిమా కి మరీ లాస్ట్ ఇయర్ రేంజ్ లో భారీ రేట్లు కాకున్నా ఇప్పుడున్న బజ్ ని బట్టి 3.2 కోట్ల రేంజ్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది, ఇది సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ఏ 1 ఎక్స్ ప్రెస్ కి కొంచం తక్కువ అని చెప్పొచ్చు. ఆ టైం లో సినిమా రిలీజ్ అయినా కానీ ఇంత బిజినెస్ చేసి ఉండేదో లేదో చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం…

పడుతూ లేస్తూ ఉన్న సందీప్ మార్కెట్ దృశ్యా ఇది మంచి డీల్ అనే చెప్పాలి. అది కూడా 8 ఏళ్ల క్రితం సినిమా కాబట్టి నిర్మాత ఓకే అంటే సినిమా త్వరలో డిజిటల్ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. లాస్ట్ ఇయర్ లేట్ చేసి ఆఫర్ ని మిస్ చేసుకున్న టీం ఈ సారి సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave a Comment