న్యూస్ బాక్స్ ఆఫీస్

8 ఏళ్ల క్రితం రికార్డ్…ఎట్టకేలకు బ్రేక్…పవర్ స్టార్ రాంపేజ్!

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది, అనేక అవరోధాలను ఎదురుకుని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది, ఒరిజినల్ పింక్ ఎంత సీరియస్ మూవీ అయినా కానీ రీమేక్ కి వచ్చే సరికి పవర్ స్టార్ కోసం కథ ట్రీట్ మెంట్ ని చేంజ్ చేయగా…

ఆ ట్రీట్ మెంట్ ఆడియన్స్ కు బాగానే నచ్చింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా, సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో చాలా కాలం తర్వాత నికార్సయిన కంబ్యాక్ మూవీ గా నిలిచింది, 8 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది సినిమాతో…

సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసిన పవర్ స్టార్ తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకోగా, ఆ కలెక్షన్స్ రికార్డులను తర్వాత చేసిన ఏ సినిమా అందుకోలేక పోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ సినిమాలు నిరాశ పరచడం తో కలెక్షన్స్ పరంగా అత్తారింటికి దారేది అలానే ఉండిపోయింది.

ఇప్పుడు ఆ సినిమా వచ్చిన 8 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండగా లేటెస్ట్ అత్తారింటికి దారేది కలెక్షన్స్ ను దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మూవీ గా…

వకీల్ సాబ్ సినిమా సంచలనం సృష్టించింది. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా తో ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్ సాధించిన మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది..

Leave a Comment