గాసిప్స్ న్యూస్

8 ఏళ్ళకి ఎపిక్ సూపర్ హీరో మూవీ సీక్వెల్……ఈ సారి నట విశ్వరూపం అంట!!

హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు చూసి చూసి ఉన్న మనం, మన ఇండియా లో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు అని అనుకోని వారు కూడా ఉండరు, కానీ ఇండియా లో కూడా ఇలాంటి సూపర్ హీరో ల కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినప్పటికీ ఒక్క సినిమా తప్పితే ఏది కూడా సక్సెస్ కాలేక పోయింది. సక్సెస్ అయిన ఒకేఒక్క సిరిస్ క్రిష్… ముందు కోయి మిల్ గయా తో మొదలైన ఈ సిరీస్ అలానే కొనసాగుతూ వస్తుండటం విశేషం….

అసలు సిసలు సూపర్ హీరో మూవీ క్రిష్ గా 2006 లో వచ్చింది, తర్వాత క్రిష్ 3 అంటూ 2013 లో మరో సినిమా కూడా రాగా అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన సినిమాలుగా నిలిచాయి. హృతిక్ రోషన్ సూపర్ హీరోగా పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం తో…

సినిమా అంచనాలను మించి హిట్ అయ్యాయి. కాగా క్రిష్ 3 రిలీజ్ అయిన 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమాకి 4 వ సీక్వెల్ ని మొదలు పెట్టబోరున్నారు… రాకేశ్ రోషన్ సినిమా ను అత్యంత భారీ ఎత్తున రూపొందించ బోతున్నట్లు సమాచారం, ఈ సినిమా లో స్పెషాలిటీ ఏముంటుంది అని అందరూ భావిస్తుండగా…

ఇందులో హృతిక్ రోషన్ 4 డిఫెరెంట్ రోల్స్ లో నటించబోతున్నారని, తన నట విశ్వరూపం ఈ సినిమా లో చూడొచ్చని అంటున్నారట. ఈ సీక్వెల్ లో మరో స్పెషల్ ఏంటంటే…. కోయి మిల్ గయా లో ఉండే ఎలియాన్ జాదూ మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా లో తిరిగి వస్తాడని, అలాగే క్రిష్ 3 లో చనిపోయే రోహిత్ పాత్ర ఇందులో హీరో ఎలా బ్రతికించు కుంటారు అన్నది సినిమా కథ పాయింట్ అని అంటున్నారు.

ఓవరాల్ గా హీరో, హీరో తండ్రి, హీరో కొడుకు మూడు పాత్రలు హృతిక్ వేస్తారని కన్ఫాం అయినప్పటికీ ఆ నాలుగో పాత్ర ఏంటి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఇయర్ ఎండ్ వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా ను అన్నీ అనుకున్నట్లు జరిగితే… 2023 లో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారని సమాచారం…

Leave a Comment