న్యూస్ బాక్స్ ఆఫీస్

8 రోజుల తర్వాత క్లీన్ హిట్ కి సీటిమార్ కి ఇంకా ఎంత కావాలంటే!!

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో తెరకెక్కిన సీటిమార్ సినిమా రిలీజ్ అవ్వడం సాలిడ్ మౌత్ టాక్ తో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తూ ఓపెన్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం ఏరియాలో కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నా కానీ ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

బాగానే హోల్డ్ చేసింది కానీ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎక్కువగా ఉండటం తో ఆ మార్క్ ని సినిమా అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ మొదలు అయినా కానీ సినిమా ఉన్నంతలో వర్కింగ్ డేస్ లో తక్కువ డ్రాప్స్ తో హోల్డ్ చేయడం తో సినిమా లాంగ్ రన్ పై ఆశలు…

ఇప్పుడు పెరిగాయి అని చెప్పాలి. కొత్త సినిమాలు రెండో వారం రిలీజ్ అయినా కానీ 340 కి పైగా థియేటర్స్ ని రెండో వారంలో హోల్డ్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు కూడా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది.

ఇక సినిమా 8 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.33Cr
👉Ceeded: 1.68Cr
👉UA: 1.17Cr
👉East: 89L
👉West: 53L
👉Guntur: 1.00Cr
👉Krishna: 52L
👉Nellore: 45L
Total AP TG: 8.57CR(14.22CR~ Gross)
👉KA+ROI: 33L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 8.98CR(15.10CR~ Gross)
ఇదీ సినిమా 8 రోజుల టోటల్ కలెక్షన్స్…

బిజినెస్ 11.5 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 12 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 8 రోజుల తర్వాత మొత్తం మీద మరో 3.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిజినెస్ ను అందుకోవాలి అన్నా 2.5 కోట్లు ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఈ శని ఆదివారాలు ఇప్పుడు చాలా కీలకం అని చెప్పాలి.

Leave a Comment