న్యూస్

8.5 కోట్ల రేటు…ఫస్ట్ టైం కన్నా సెకెండ్ టైం ఎక్కువ TRP…భీష్మ కుమ్మిందిగా ఈ సారి!

2020 ఇయర్ లో ఫిబ్రవరి టైం లో అన్ సీజన్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన సినిమా భీష్మ, యూత్ స్టార్ నితిన్ మరియు రష్మిక ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అండ్ అప్పటికే జోరు చూపుతున్న సంక్రాంతి సినిమాలు ఉన్నప్పటికీ మంచి వసూళ్ళతో బ్లాక్ బస్టర్ అయింది.

కానీ తర్వాత టెలివిజన్ కి వచ్చేసరికి మాత్రం మొదటి సారి TRP రేటింగ్ విషయం లో అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా.. ఈ సినిమాను సుమారు జెమినీ టీవీ వాళ్ళు ఏకంగా 8.5 కోట్ల భారీ రేటు కి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా మొదటిస్ సారి…

టెలికాస్ట్ అయినప్పుడు సినిమా ఆ రేటు కి న్యాయం చేసేలా రేటింగ్ ను అందుకోలేదు… మొదటి సారి టెలికాస్ట్ లో భీష్మ సినిమా మొత్తం మీద 6.65 రేటింగ్ ను సొంతం చేసుకోగా… అప్పుడు నిరాశ పరిచినప్పటికీ రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ అయిన భీష్మ ఈ సారి కుమ్మింది.

మొదటి సారిని మించి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద 7.6 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. కొన్ని కొన్ని సినిమాలు ఫస్ట్ టైం రాంగ్ టైమింగ్ వలనో లేక ఇతర కారణాల వలనో తక్కువ రేటింగ్ ను సొంతం చేసుకుంటాయి, కానీ తర్వాత మాత్రం మంచి రేటింగ్ లను దక్కించుకుని సత్తా చాటుతాయి. ఇప్పుడు భీష్మ విషయం లో కూడా ఇదే జరిగింది.

మొదటి సారి అంచనాలను అందుకోక పోయినా రెండో సారి అందుకుని పెట్టిన రేటుకి న్యాయం చేయగా సినిమా ఆల్ మోస్ట్ పెట్టిన రేటు కి రికవరీ చేసినట్లేనని అంటున్నారు. లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో కూడా హైయెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది భీష్మ సినిమా..

Leave a Comment