న్యూస్ స్పెషల్

80 లక్షలతో 17 కోట్లు…టాప్ 2….ఎపిక్ మూవీ కి 19 ఏళ్ళు!!

కొన్ని కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాజిక్ చేసి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి అల్టిమేట్ విజయాలుగా నిలుస్తాయి, అలాంటి రికార్డులు ఈ మధ్య కాలం లో కొంచం తక్కువ అయ్యాయి కానీ రీసెంట్ గా కొన్ని సినిమాలు మళ్ళీ ఇలాంటి రికార్డులను నమోదు చేస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఒక సినిమా కి టాక్ వస్తే చాలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్…

దగ్గర అద్బుతాలు సృష్టించేది, అందునా కొంచం క్రేజ్ ఉన్న సినిమా అయితే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు నమోదు అయ్యేవి, అలాంటి అద్బుతం సృష్టించిన సినిమాల్లో నితిన్ హీరోగా లాంచ్ అయిన జయం సినిమా కూడా ఒకటి… వరుస పెట్టి విజయాలతో టాలీవుడ్ లో..

పెను సంచలనం సృష్టించిన తేజ డైరెక్షన్ లో నితిన్ సదాలు లీడ్ పెయిర్ గా గోపీచంద్ విలన్ గా లాంచ్ అయిన జయం సినిమా కేవలం 80 లక్షల లోపు బడ్జెట్ లో పూర్తీ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని నమోదు చేసింది, అప్పటికి డెబ్యూ హీరో మూవీ పరంగా తరుణ్ నువ్వే కావాలి సినిమా 19 కోట్ల రేంజ్ లో..

కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊరమాస్ రికార్డ్ ను నమోదు చేయగా జయం సినిమా కూడా 17 కోట్ల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని డెబ్యూ హీరోల్లో టాప్ 2 ప్లేస్ ని అప్పుడు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా ఒక్క నైజాం ఏరియా లోనే…

7.5 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, కొన్ని సెంటర్స్ 2 వారాల రన్ ని మాత్రమే ఎక్కువగా సొంతం చేసుకునే రోజుల్లో ఈ సినిమా 50 రోజులు నాన్ స్టాప్ హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపింది, రన్ కంప్లీట్ అయ్యాక రీ రిలీజ్ లో కూడా కొన్ని సెంటర్స్ లో అద్బుతాలు సృష్టించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 19 ఏళ్ళు పూర్తీ అవ్వడం విశేషం…

Leave a Comment