న్యూస్ బాక్స్ ఆఫీస్

80 లక్షలు అనుకుంటే చక్ర ఫస్ట్ డే దుమ్ము లేపే కలెక్షన్స్ ఇవి!!

యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా అనుకున్న అంచనాలను కూడా మించేసే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓపెనింగ్స్ పరంగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు పొగరు కన్నా తక్కువ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది..

కానీ టాక్ పవర్ తో సినిమా ఈవినింగ్ షోలకు మంచి ట్రెండ్ ని సొంతం చేసుకోగా అంచనాలను మించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా..

ఆ అంచనాలను కూడా మించిపోయి ఏకంగా ఒక కోటి మార్క్ ని కూడా దాటేసి సత్తా చాటుకుంది. పోటి లో రిలీజ్ అయిన 4 సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది ఈ సినిమా… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 32L
👉Ceeded: 19L
👉UA: 14L
👉East: 9L
👉West: 7.2L
👉Guntur: 10L
👉Krishna: 9.6L
👉Nellore: 7L
AP-TG Total:- 1.08CR (2Cr Gross~)
ఇవీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్… సినిమా అనుకున్న లెక్క కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో…

మొత్తం మీద 4.9 కోట్ల రేటుకి అమ్మారు, సినిమా 5.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 4.32 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. ఇక రెండో రోజు సినిమా ఎలాంటి ప్రదర్శనని కనబరుస్తుందో చూడాలి…

Leave a Comment