గాసిప్స్ న్యూస్

85 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టాడు….అయినా కొత్త సినిమా లేదు!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరైనా మంచి హిట్ కొడితే వాళ్ళకి వరుస పెట్టి ఆఫర్స్ రావడం అన్నది చాలా కామన్ ఇండస్ట్రీలో. అలాంటిది ఏదైనా రికార్డ్ అందుకునే రేంజ్ లో హిట్ కనుక కొడితే ఇక ఆఫర్స్ ఓ రేంజ్ లో వెల్లువలా వచ్చి పడతాయి కానీ రీసెంట్ గా ఓ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ టీం లో అందరూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నా కానీ…

ఆ సినిమాను తీసిన డైరెక్టర్ మాత్రం తన అప్ కమింగ్ మూవీ ని ఇంకా మొదలు పెట్టలేదు సరికదా అనౌన్స్ కూడా చేయలేదు… ఆ సినిమానే ఉప్పెన ఆ డైరెక్టర్ పేరే బుచ్చిబాబు సనా… ఈ ఇయర్ మొదట్లో వచ్చిన ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని…

సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆ సినిమా లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ ఇద్దరికీ కూడా వరుస పెట్టి ఆఫర్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్…

బుచ్చిబాబు ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు, కొన్ని కథలను స్టార్ హీరోలకు అనుకుని వినిపించినా కానీ ఎవ్వరూ కూడా అనుకూలంగా స్పందించలేదట. కొందరు మీడియం రేంజ్ హీరోల దగ్గరికి కూడా వెళ్ళినప్పటికీ వాళ్ళు ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉండటం తో తర్వాత చూద్దాంలే అన్నట్లు చెబుతున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది… కానీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే…

బుచ్చిబాబు తో తదుపరి సినిమా ను కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు, కానీ అందులో నటించడానికి ఏ హీరో వస్తారు అన్నది తెలియాల్సి ఉంది, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా కానీ ఇలా కొత్త సినిమా కోసం కష్టపడటం ఇండస్ట్రీలోనే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, మరి ఫైనల్ గా ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఏ హీరో తో సినిమా అనౌన్స్ చేస్తాడో చూడాలి ఇక.

Leave a Comment