న్యూస్

85 కోట్ల సినిమా వల్ల కానిది నారప్ప వల్ల అయ్యిందిగా…మాస్ ఇది!

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా మాస్ కంటెంట్ కి బి సి సెంటర్స్ లో ఫుల్ కలెక్షన్స్ తో మాస్ జాతర చూపెట్టే అవకాశం విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప కి కచ్చితంగా ఉందని చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ని ఊరించినా కానీ ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న నారప్ప సినిమా అక్కడ కూడా…

ఆడియన్స్ ను ఏమాత్రం నిరాశ పరచలేదు అనే చెప్పాలి. రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అవడానికి తెలుగు రిలీజ్ అయినా కానీ సౌత్ అంతటా కూడా సినిమా కి సాలిడ్ గా వ్యూవర్ షిప్ లభించింది అని అంటున్నారు.

ఇక ఈ ఇయర్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు భారీ రేటు పెట్టి కొన్న సినిమాలు కొన్ని ఉండగా జులై నెలలోనే ఒక క్రేజీ హిందీ సినిమాను 85 కోట్ల రేటు కి కొన్నారు. ఆ సినిమానే ఫర్హాన్ అక్తర్ మరియు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో వచ్చిన తూఫాన్ సినిమా…

ఈ సినిమా పై బాలీవుడ్ తో పాటు అమెజాన్ ప్రైమ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నా సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది. దాంతో పెట్టిన డబ్బుకి ఏమాత్రం న్యాయం చేయని టైం లో బరిలోకి దిగిన నారప్ప సినిమా 40 కోట్ల రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ అద్బుతమైన వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం.

దాంతో 85 కోట్ల సినిమా మీద ఆశలు పెట్టుకున్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి ఆ సినిమా నిరాశ పరచడం తో ఆ సినిమా చేయలేని పనిని ఇప్పుడు నారప్ప సినిమా చేస్తూ భారీ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం. దాంతో జులై నెలలో టాపర్ గా నిలిచి దుమ్ము లేపుతుంది నారప్ప సినిమా.

Leave a Comment