న్యూస్

9 గంటల రిపోర్ట్…అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి…కానీ!!

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా టీసర్ ఎట్టకేలకు ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా టీసర్ 24 గంటల్లో సంచలన రికార్డులను నమోదు చేస్తుంది అనుకుంటే ముందే లీక్ అవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ లో ఉండటంతో ఇనీషియల్ రికార్డులు మిస్ అవ్వగా ఇప్పుడు అదే కంటిన్యూ అయ్యి 24 గంటల రిపోర్ట్ పై ఎఫెక్ట్ అయ్యేలా ఉంది.

సినిమా టీసర్ 1 లక్ష లైక్స్ ని 22 నిమిషాల్లో, 2 లక్షల లైక్స్ ని 64 నిమిషాల్లో 3 లక్షల లైక్స్ ని 2 గంటల 53 నిమిషాల్లో 4 లక్షల లైక్స్ ని 8 గంటల 19 నిమిషాల్లో అందుకోగా 9 గంటల్లో UV ఛానెల్ లో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని 407K లైక్స్ ని అందుకుంది.

T సిరీస్ లో 2.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని 270K రేంజ్ లైన్స్ ని అందుకుంది. 2 కలిపి 12.5 మిలియన్ వ్యూస్ ని 680K రేంజ్ లైక్స్ ని అందుకోగా టాలీవుడ్ వ్యూస్ రికార్డ్ కొట్టాలి అన్నా 23 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని లైక్స్ పరంగా 940.3K లైక్స్ ని అందుకోవాలి… ఫ్యాన్స్ నైట్ కష్టపడితే ఇనీషియల్ రికార్డులు మిస్ అయినా 24 గంటల్లో ఇప్పటికీ రికార్డ్ కొట్టే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Comment