న్యూస్ బాక్స్ ఆఫీస్

90 కోట్ల టార్గెట్…6 రోజుల్లో వకీల్ సాబ్ కలెక్షన్స్ ఇవే!

బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా రిలీజ్ రోజు నుండే అనేక అవరోధాలను ఎదురుకున్నా కానీ స్టడీ గా దూసుకు పోతూ సంచలనాలను సృష్టిస్తూనే ఉంది, వీకెండ్ తర్వాత టికెట్ రేట్లు బాగా తగ్గగా అయినా కానీ సినిమా కలెక్షన్స్ స్టడీ గా ఉండటం విశేషం. సినిమా 5 వ రోజు ఉగాది హాలిడే…

ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత అంబేద్కర్ జయంతి ని కూడా ఫుల్లుగా వాడుకుంటుంది అనుకున్నా కొంచం స్లో అయింది, సినిమాకి డ్రాప్స్ ఉన్నప్పటికీ 6 వ రోజు 5 కోట్లకు తగ్గని షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా కొంచం తగ్గింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు సినిమా 4.83 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. టికెట్ హైక్స్ తో ఉండి ఉంటె 6 కోట్లకు పైగానే కలెక్షన్స్ అవలీలగా సొంతం చేసుకుని ఉండేది. అయినా కానీ సినిమా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా…

సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 22.37Cr
👉Ceeded: 11.71Cr
👉UA: 10.52Cr (inc.GST)
👉East: 5.76Cr (inc.GST)
👉West: 6.39Cr (inc.GST)
👉Guntur: 6.47Cr (inc.GST)
👉Krishna: 4.41Cr (inc.GST)
👉Nellore: 3.06Cr
AP-TG Total:- 70.69CR (108.10Cr~ Gross)
KA+ROI – 3.55Cr (Corrected)
OS- 3.65Cr (Corrected)
Total WW: 77.89CR(123.5Cr~ Gross)(Corrected)
ఇవీ సినిమా 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్.

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 90 కోట్లు కాగా సినిమా 6 రోజులలో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 12.11 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వారం లో కూడా ఏ సినిమా పెద్దగా పోటి ఇచ్చేలా లేదు కాబట్టి సినిమా కి అడ్డే లేదని చెప్పాలి. మరి వకీల్ సాబ్ ఈ అడ్వాంటేజ్ ను ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి.

Leave a Comment