న్యూస్ బాక్స్ ఆఫీస్

ABCD ఫస్ట్ డే కలెక్షన్స్!

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ABCD రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కి పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ 30% వరకు ఆక్యుపెన్సీ ఓవరాల్ గా లభించింది అని చెప్పాలి, కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి.

ఓవరాల్ గా మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆన్ లైన్ టికెట్ సేల్స్ అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగున్నాయని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పూర్తి స్థాయి లో జోరు చూపితే సినిమా మొదటి రోజు రెండు రాష్ట్రాలలో 1 కోటి కి పైగా షేర్ ని అందుకునే చాన్స్ ఉంది.

ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకుంటే మాత్రం 80 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవచ్చు. సినిమా 7 కోట్ల బిజినెస్ చేయగా 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా వీకెండ్ లో సాలిడ్ గ్రోత్ చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!