గాసిప్స్ న్యూస్ స్పెషల్

ఎన్టీఆర్ తో అనుకున్న సినిమాను చేయనున్న అఖిల్ అక్కినేని

అక్కినేని ఫ్యామిలీలో ఎప్పుడు ఏ హీరోకి రానంత హైప్ సంపాదించుకున్న హీరో అఖిల్ అక్కినేని. తొలి సినిమాకే భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ కుర్ర హీరో వినాయక్ డైరెక్షన్ లో భారీ ఎత్తున విడుదల అయిన అఖిల్ అట్టర్ ఫ్లాఫ్ తెచ్చుకోవడమే కాకుండా ఆ ఇయర్ లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలవడంతో తరువాతి స్టెప్ ఎలా వేయాలో తెలియక తికమక పడి హలో అంటూ లవ్ స్టొరీ తో వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా దెబ్బ తిన్నాడు.

తర్వాత మజ్ను అంటూ రొమాంటిక్ ఎంటర్ తో వచ్చినా విజయాన్ని అందుకోలేక పోయాడు. కాగా ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో సరికొత్త సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు అఖిల్ అక్కినేని. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో

నిర్మించ బోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సినిమా గురించిన న్యూస్ ఒకటి ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ చివరగా ఇక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేయాల్సి ఉండగా అది కాన్సిల్ అయింది.

ఇప్పుడు అదే స్టొరీ ని కొన్ని మార్పులు చేర్పులు చేసి అఖిల్ కి సెట్ అయ్యే విధంగా మార్చి గీత ఆర్ట్స్ లో తెరకెక్కించ బోతున్నారనే టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది. యూత్ ని మెప్పించే అన్ని అంశాలు ఈ సినిమా లో ఉండేలా పక్కా గా స్క్రిప్ట్ ని మార్చాడట భాస్కర్. 

అప్పుడు ఎన్టీఆర్ నో చెప్పడానికి కారణాలు తెలియవు కానీ ఇప్పుడు ఈ కథ విషయం లో అఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అంటున్నారు. త్వరలోనే సినిమా పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!