న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

187 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా…నో చెప్పి షాక్ అఖిల్!!

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టపడుతూ టోటల్ రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే…. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కి అనుకున్న రేంజ్ రెవెన్యు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రావడం లేదు… అఖిల్ పెర్ఫార్మెన్స్ కి వెంకీ అట్లూరి టేకింగ్ కి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో పాటు

సినిమాకి యునానిమస్ హిట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాతో అఖిల్ మాస్ లో మరింత జొచ్చుకుపోవడం ఖాయం అని అంతా అనుకున్నా క్లాస్ సినిమా అవ్వడంతో అలా జరగలేదు. ఈ సినిమాను ఒప్పుకునే క్రమంలో ఓ సూపర్ డూపర్ హిట్

మూవీ రీమేక్ ఆఫర్ అఖిల్ కి వస్తే నో చెప్పి షాక్ ఇచ్చాడట. ఆ సినిమా మరేదో కాదు 70 కోట్ల బిజినెస్ తో 187 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన 2013 సమ్మర్ బ్లాక్ బస్టర్ హే జవానీ హై దీవాని… కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను తెలుగు లో హలో కి ముందు

రీమేక్ చేయాలి అనుకున్న హలో కథ విని హలో కి ఫిక్స్ అయిన అఖిల్ ఈ రీమేక్ కి నో చెప్పాడట…. మళ్ళీ మిస్టర్ మజ్ను సమయం లో ఈ రీమేక్ ని రూపొందించాలి అని ట్రై చేసినా సెట్ కాలేదట. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఆ మూవీ చేసి ఉంటె హలో మరియు

మిస్టర్ మజ్ను కన్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చేదని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైతే ఏమి ప్రస్తుతానికి తన కి మొదటి సినిమా కి ముందు ఉన్న మంచి మార్కెట్ ని తెలిసి తెలియకుండా వరుసగా పోగొట్టు కుంటూ వస్తున్నాడు. ఇక మీదట అయినా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

 

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!