న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇది సరిపోదు సామి…ఇక కష్టమే!

అఖిల్ హలో సినిమాల తర్వాత అఖిల్ అక్కినేని నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో పరిస్థితి మారిపోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ 23 కోట్ల రేంజ్ లో నే ఉండటం సినిమా కి వచ్చిన టాక్ తో సినిమా పోటి లో కొత్త….

సినిమాలు ఏవి లేక పోవడం తో కచ్చితంగా ఆ మార్క్ ని అందుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అని అంతా భావించారు, కానీ అందరికీ షాక్ ఇస్తూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ నుండి పూర్తిగా స్లో డౌన్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా 5 మరియు 6 వ రోజులలో సినిమా కలెక్షన్స్ మరీ షాకింగ్ లెవల్ లో ఉన్నాయని సమాచారం, దాంతో సినిమా అనుకున్న టార్గెట్ ని అందుకోవడానికి ఈ రేంజ్ ఏమాత్రం సరిపోదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరో పక్క ఈ వారం కూడా…

పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేక పోవడం తో సినిమా పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అది చాలా తక్కువగానే కనిపిస్తుంది, తోలి రెండు సినిమాల కన్నా బెటర్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కామన్ ఆడియన్స్ ఈ సినిమా ను ఓన్ చేసుకోలేక పోతున్నారు.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ప్రభావం గట్టిగానే కనిపిస్తుంది, ఓవరాల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ వివరాలు పూర్తీ వివరాలతో అప్ డేట్ చేస్తాం. చూస్తుంటే అఖిల్ కి మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ మిగిలేలానే కనిపిస్తుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!