న్యూస్ బాక్స్ ఆఫీస్

కర్ణాటకలో అరవింద సమేత ఓపెనింగ్స్…మైండ్ బ్లోయింగ్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర అరవింద సమేత జోరు మొదలు అయింది…ప్రీమియర్ షోలతో కుమ్మెసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మెస్తుండగా ఎన్టీఆర్ కి కంచుకోటగా చెప్పుకునే కర్ణాటకలో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అనేది ఆసక్తిగా మారింది.

సుమారు 370 లోపు థియేటర్స్ లో అక్కడ రిలీజ్ అయిన అరవింద సమేత అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజుకి గాను ఆల్ మోస్ట్ 60% కి పైగా జరిగాయి…ఇక రిలీజ్ రోజుకి వచ్చే సరికి ఆక్యుపెన్సీ మరింత పెరిగి 75% ని టచ్ చేసింది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకి కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది.

దాంతో మొదటి రోజు ఇక్కడ సినిమా మినిమమ్ 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు షేర్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి…ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ మరింత పెరిగితే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!