న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

అరవింద సమేత TRP రేటింగ్…షాకింగ్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విషయం తెలిసిందే, కాగా సినిమా వెండి తెరపై అదరగొట్టిన తర్వాత బుల్లి తెరపై ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అవ్వగా సినిమా TRP రేటింగ్ రిలీజ్ అయింది.

సినిమా అనుకున్న రేంజ్ లో ఓవరాల్ TRP రేటింగ్ ని అందుకోలేక పోయింది, మినిమమ్ 18 రేంజ్ లో TRP రేటింగ్ వస్తుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా సినిమా TRP రేటింగ్ 13.7 TRP రేటింగ్ వచ్చిందని సమాచారం, ఇది మరీ తక్కువ కాదు కానీ,..

ఎన్టీఆర్ రీసెంట్ మూవీస్ లో జనతా గ్యారేజ్ 20.69 తో BARC వచ్చాక టాప్ లో ఉండగా ఛానెల్ రిలీజ్ చేసిన TRP రేటింగ్ లో టెంపర్ 26 తో టాప్ లో ఉంది, దాంతో ఈ సినిమా TRP రేటింగ్ పరంగా కుమ్మేస్తుంది అనుకున్నా మాస్టర్ ప్రింట్ వచ్చి చాలా రోజులు అవ్వడం…

పండగ సమయం లో జనాలకు చూడటానికి ఇతర చానెల్స్ లో చాలా సినిమాలు ఉండటం, వాటికి తోడూ థియేటర్స్ లో కొత్త సినిమాలు భారీ గా ఉండటం ఇవన్నీ అరవింద సమేత వీర రాఘవ TRP రేటింగ్ పై కొంతవరకు ప్రభావం అయితే చూపాయి అని చెప్పాలి.

అయినా కానీ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో TRP రేటింగ్ ని అందుకోవడం లో అరవింద సమేత అంచనాలు తప్పింది అన్నది నిజం, ఇక ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న RRR తో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తారో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!