న్యూస్ రివ్యూ వీడియో

#BB3 ఫస్ట్ రోర్ టీసర్ రివ్యూ….బాలయ్య సింహ గర్జన…మెంటల్ మాస్ అంతే!!

నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైం లో పెద్దగా ఫాం లో లేకున్నా కానీ తన అప్ కమింగ్ మూవీ పై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి, దానికి కారణం ఇది వరకు తాను ఇలా ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో సింహా మరియు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను తో కలిసి బాలయ్య చేస్తున్న అప్ కమింగ్ మూవీ పై క్రేజ్ భారీగా పెరిగింది.

రీసెంట్ గా బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా సినిమా లో ఒక ఫైట్ సీన్ ని కొంచం ఎడిట్ చేసి గ్లిమ్స్ గా టీం రిలీజ్ చేశారు, కానీ టీసర్ కి ఏమాత్రం తీసిపోని ఇంపాక్ట్ ని కలిగించింది ఈ ఫస్ట్ రోర్.. బాలయ్య ని డైరెక్టర్స్ లో బోయపాటి చూపెట్టినంత పెర్ఫెక్ట్ గా మరెవరూ చూపెట్టలేరేమో…

అని మళ్ళీ అనిపించే విధంగా బాలయ్య లుక్ ఆదరగోట్టేసింది. పంచె కట్టు తో మెరసిన గడ్డం తో బాలయ్య లుక్ సింహా లెజెండ్ ని మించే రేంజ్ లో లేదు కానీ వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా అయితే ఉందని చెప్పాలి. ఇక తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఎలివేట్ అయింది.

ఇక బోయపాటి రాసిన డైలాగ్ బాలయ్య నోటి వెంట రాగానే మరింత పవర్ ఫుల్ గా మారిందని చెప్పొచ్చు. ఇక టీసర్ చివర్లో మీసం మెలేస్తూ బాలయ్య లుక్ ఓవరాల్ గా టీసర్ కి బిగ్గెస్ట్ హైలెట్ అని చెప్పాలి. మొత్తం మీద చిన్న గ్లిమ్స్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపెట్టాడు బోయపాటి శ్రీను.

కచ్చితంగా ఇది బాలయ్య ఫ్యాన్స్ కి అల్టిమేట్ బర్త్ డే గిఫ్ట్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ వరుస ఫ్లాఫ్స్ ని మరిపించే విధంగా ఈ గ్లిమ్స్ ఆకట్టుకోగా, సోషల్ మీడియా లో ఫ్యాన్స్ బర్త్ డే ట్రెండ్ తో బిజీ గా ఉన్నారు. 24 గంటల్లో సీనియర్ హీరోల్లో బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ నమోదు చేసే పనిలో ఉన్నారు వారు…

Leave a Comment