న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

6 డిసాస్టర్లు ఉన్నా…ఈ బిజినెస్ ఏంటి సామి!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ఒక్క రేయ్ సినిమా తప్పితే వరుసగా పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మరియు సుప్రీమ్ సినిమాలతో హాట్రిక్ విజయాలు కొట్టి యూత్ లో హాట్ ఫేవరేట్ హీరో అయిపోయాడు. కానీ తర్వాత మాత్రం వరుస పెట్టి పరాజయాలతో తన మార్కెట్ ని ఒక్కో సినిమా కి కొంచం కొంచం గా కోల్పోతూ వచ్చాడు సాయి ధరం తేజ్.

సుప్రీమ్ తర్వాత వరుసగా తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ మరియు తేజ్ ఐ లవ్ యు అంటూ 6 డిసాస్టర్ మూవీస్ పడటం తో ఇక సాయి ధరం తేజ్ మార్కెట్ పూర్తిగా పడి పోయినట్లే అని అంతా భావించిన తరుణంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాతో…

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరం తేజ్ ఈ సినిమా బిజినెస్ పరంగా మళ్ళీ తన మార్క్ ని చూపెడుతూ దూసుకు పోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ అండ్ తర్వాత వచ్చిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కిన విషయం అందరికీ తెలిసిందే.

దాంతో సినిమా కి బిజినెస్ పక్కకు పెడితే శాటిలైట్ రైట్స్ మరియు ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కింద భారీ మొత్తం ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. జెమినీ టివి వారు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను 4.5 కోట్ల దాకా రేటు ఇచ్చి దక్కించుకున్నట్లు సమాచారం. ఇక స్ట్రీమింగ్ హక్కులు…

అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా 3.1 కోట్ల రేటు ఇచ్చి దక్కించుకున్నారట. ఈ రెండు కలిపే ఏకంగా 7.6 కోట్ల దాకా రేటు దక్కడం అది కూడా 6 వరుస డిసాస్టర్ మూవీస్ తర్వాత దక్కడం అంటే గొప్పే అని చెప్పాలి. ఇక సినిమాతో సాయి ధరం తేజ్ బౌన్స్ బ్యాక్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!