న్యూస్ బాక్స్ ఆఫీస్

ఎన్టీఆర్ కథానాయకుడు డే 2 vs యాత్ర డే 2…ఊహకందని షాక్ ఇది!

కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా Y S R గారి పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర.. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 2.2 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా 3 కోట్ల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని దుమ్ము లేపగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర

రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అని భావించగా అనుకున్నట్లే సినిమా 1.43 కోట్ల వరకు షేర్ ని సాధించింది. రెండు రాష్ట్రాల 2 రోజుల టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

Nizam – 1.12 Cr Ceeded – 0.68 Cr UA – 0.29 Cr East – 0.15 Cr West – 0.24 Cr Krishna – 0.29 Cr Guntur – 0.64 Cr Nellore – 0.22 Cr AP & TS combined is 3.63 Cr… ఓవరాల్ గా రెండు రోజుల్లో సినిమా అద్బుతమైన వసూళ్ళ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది..

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజులకు గాను 5 కోట్ల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఏకంగా ఈ ఇయర్ తొలి బిగ్గెస్ట్ రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు రెండో రోజు కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువగా ఉండటం.

ఎన్టీఆర్ కథానాయకుడు రెండో రోజు కేవలం 1.3 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకోగా యాత్ర సినిమా 1.43 కోట్ల షేర్ ని లిమిటెడ్ థియేటర్స్ అందుకుంది, భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఎన్టీఆర్ కథానాయకుడు కన్నా పక్క రాష్ట్ర హీరో నటించిన పొలిటికల్ మూవీ కి ఇలాంటి కలెక్షన్స్ రావడం విశేషం అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!