న్యూస్ బాక్స్ ఆఫీస్

118 డే 5 ఓపెనింగ్స్…జోరు తగ్గింది…కానీ!!

నంద మూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో అనుకున్న టార్గెట్ ని అందు కుని దుమ్ము లేపింది, అన్ సీజన్, పెద్ద గా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా సినిమా మంచి వసూళ్లు సాదించి 4 రోజుల్లో 7.18 కోట్ల షేర్ ని 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని అద్బుతమైన వసూళ్ళ తో 4 రోజులుగా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ డ్రాప్స్ తో…

అందుకుని 6.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని క్రాస్ చేసి 2019 ఇయర్ కి గాను క్లీన్ హిట్ గా నిలిచిన రెండో సినిమా గా మారింది, ఇక సినిమా నాలుగు రోజుల హాలిడేస్ ని ఎంజాయ్ చేసిన తర్వాత 5 వ రోజు తొలి అఫీషియల్ వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంది.

కాగా వర్కింగ్ డే అవ్వడం తో సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి 4 రోజులతో పోల్చితే డ్రాప్స్ కొంచం గట్టిగానే ఉన్నాయి అని చెప్పాలి. 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ తొలి రెండు షోలకి 60% నుండి 65% వరకు ఉన్నాయని సమాచారం.

వరుస హాలిడేస్ తర్వాత వర్కింగ్ డే డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి, పైగా సినిమా అనుకున్న టార్గెట్ ని 4 రోజుల లోనే అందుకోవడం తో ఇప్పుడు సినిమా 5 వ రోజు నుండి ఎంత వసూల్ చేస్తే అంత లాభాల లిస్టు లోకే వెళుతుంది కాబట్టి.. సినిమా ఈవినింగ్ అండ్…

నైట్ షోలలో గ్రోత్ ని సాధిస్తే 60 లక్షల నుండి 80 లక్షల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. మరి రోజు ముగిసే సరికి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!